దేశ వ్యాప్తంగా 5 కోట్ల 21 లక్షల మందికి పైగా కరోనా టీకా పంపిణీ చేశినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది.
బుధవారం ఒక్కరోజే 13 లక్షల 54 వేల 976 డోసులు అందజేశామని వెల్లడించింది.
ఇప్పటివరకు 79 లక్షల 56 వేల 925 మంది ఆరోగ్య సిబ్బందికి, 84 లక్షల 33 వేల 875 మంది తొలి వరుస కరోనా యోధులకు తొలి డోసు టీకా అందించామని పేర్కొంది.
50 లక్షల 47 వేల 927 మంది ఆరోగ్య సిబ్బింది, 32 లక్షల 2 వేల 183 మంది తొలి వరుస కరోనా యోధులకు రెండో డోసు టీకా పంపిణీ చేశామని తెలిపింది.
2 కోట్ల 26 లక్షల ఒక వెయ్యీ 622 మంది వృద్ధులకు టీకా అందించగా, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారితో పాటు, 45 ఏళ్ళు పైబడిన 49 లక్షల 54 వేల 848 మంది టీకా తీసుకున్నారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.