CI కి ఫైన్ వేసి…మాస్క్ తొడిగిన SP అమ్మిరెడ్డి
దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో అందరూ మాస్క్ వాడటం తప్పనిసరి అనే విషయం తెలిసిందే.
అయితే గుంటూరు అర్బన్ పరిధిలో మాస్కు ధరించని వారికై జిల్లా ఏస్పి అమ్మిరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.
ఎస్పీ అమ్మిరెడ్డి లాడ్జికూడలి ఎంటీబీ కూడలి వద్ద స్పెషల్ డ్రైవ్లో పాల్గొన్నారు.
లాడ్జి కూడలిలో తుళ్లూరు ట్రాఫిక్ సీఐ మల్లికార్జునరావు మాస్కు ధరించకుండా అటుగా వెళ్లడం ఎస్పీ గుర్తించారు.
వేంటనే సీఐని ఆగమని కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అందరూ తప్పని సరిగా మాస్క్ ధరించాలి మీరు ఎందుకు మాస్క్ ధరించలే అని ప్రశ్నించగా సీఐ హడావిడిలో మర్చిపోయాను సార్ అనిచెప్పారు.
దీంతో తుళ్లూరు ట్రాఫిక్ సిఐ మల్లికార్జునరావుకు ఎస్పీ అమ్మిరెడ్డి జరిమానా విధించి స్వయంగా మాస్కు తొడిగారు.
కరోనా వైరస్ ఉద్ధృతంగా వ్యాప్తిచెందుతున్న క్రమంలో పోలీసులు సైతం జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ సూచించారు.
మాస్కు ధరించని కారణంగా సీఐకి అపరాధ రుసుం (ఫైన్) విధించాలని అధికారులను ఆదేశించారు.
అంతేకాదు ఎస్పీ స్వయంగా మాస్కు తెప్పించి సీఐకి తగిలించారు.
అలాగే వాహనదారులను ఆపి మాస్క్ ధరించకుండా రోడ్లపైకి రావొద్దని హెచ్చరించారు. మాస్కులు ధరించిన వారినే అనుమతించాలని ఆయన అన్నారు.