రాష్ట్ర కోవిడ్ కమాండ్ కంట్రోల్ కమిటీలో మార్పులు
రాష్ట్ర కోవిడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ తీసుకున్న వివిధ చర్యలను సమర్థవంతంగా పర్యవేక్షించడానికి మరియు విలువైన సలహాలను ఇవ్వడానికి ఏర్పాటు చేసిన మంత్రిత్వ కమిటీలో మార్పులు చేస్తు ఈ రోజు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నూతన కమిటీ కన్వీనర్ గా మంత్రి శ్రీ ఆళ్ళ శ్రీనివాస్ (నాని)ని నియమించగా, ఇతర మంత్రులు మేకతోటి సుచరిత, బొచ్చ సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్, కన్నబాబు, సీదిరి అప్పల రాజు లను సభ్యులుగా నియమించారు.
రాష్ట్ర కోవిడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ తీసుకున్న వివిధ చర్యలను సమర్థవంతంగా పర్యవేక్షించడానికి మరియు విలువైన సలహాలను ఇవ్వడానికి ఏర్పాటు చేసిన మంత్రిత్వ కమిటీలో ఈ మార్పులు తక్షణం అములోకి వస్తాయని అధికారిక ఉత్తర్వులో పేర్కొన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్న కరోనా ని కట్టడి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర కోవిడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ తీసుకున్న వివిధ చర్యలను సమర్థవంతంగా పర్యవేక్షించడానికి మరియు విలువైన సలహాలను ఎప్పటికప్పుడు అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు చేరువ చేయడానికి నూతన క్యాబినెట్ మంత్రిత్వ కమిటీను కొత్తవారితో పునరుద్ధరణ చేయడం జరిగింది.
ఈకమిటీలో మరింత బాధ్యతగా పని చేసే వ్యక్తి మన రాష్ట్ర పశుసంవర్ధక పాడిపరిశ్రమాభివృద్ధి మరియు మత్సశాఖ మంత్రివర్యులు శ్రీ డాక్టర్ సీదిరి అప్పలరాజు గారని గుర్తించి అతనికి మరింత బాధ్యత అప్పగించిన జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన కృతఙతలు తెలియజేసారు.