మెదక్ జిల్లా: మల్లన్న సాగర్ ముప్పు గ్రామమైన ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామస్తులకు సంఘీభావం తెలపడానికి చలో ఏటిగడ్డ కిష్టాపూర్ కార్యక్రమానికి బయలుదేరుతున్న కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ బొమ్మల యాదగిరిని పోలీసులు అరెస్ట్ చేయగా, ఇది తెలంగాణ ప్రభుద్వ దౌర్జన్యానికి నిదర్శనమని కాంగ్రెస్ శ్రేణులు వాపోతున్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రజలను నమ్మించి గొంతు కోసే విధంగా పాలన కొనసాగిస్తుందని ఈ సందర్భంగా యాదగిరి దుయ్యబట్టారు.
నష్టపోయిన వారికి సరైన నష్టపరిహారం లేకుండా గ్రామస్తులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, వెంటనే వారికి అన్ని రకాలుగా ఆర్ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన డిమాండ్ చేసిందని ఈ సందర్భంగా బొమ్మల యాదగిరి తెలియ జేశారు.
అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదని బాధిత గ్రామాల ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉండి పోరాటం కొనసాగిస్తామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.