జనసేన వీడి…
వైఎస్సార్సీపీ లో…
రేవు శ్రీను ఆధ్వర్యంలో చేరిక…
తోట త్రిమూర్తులు కు బాసట…
మండపేట:- మండపేట 12 వ వార్డు లో జనసేన కార్యకర్తలు ఆ పార్టీ ని వీడి వైఎస్సార్సీపీ లో చేరారు.
12 వ వార్డుకు చెందిన వీరు వైఎస్సార్సీపీ నేత, 12 వ వార్డు ఇన్ ఛార్జ్ పప్పుల మసేను వెంకన్న(రేవు శ్రీను) ఆధ్వర్యంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
12 వ వార్డు లో గురువారం జరిగిన కార్యక్రమంలో జన సేన 12 వ వార్డు అభ్యర్థి గా నామినేషన్ వేసి ఉపసంహరించుకున్న బరిశెట్టి సుబ్బలక్ష్మి, మరికొందరు జనసేన పార్టీ కి రాజీనామా చేసి వైఎస్సార్సీపీ లో చేరారు.
వీరికి రేవు శ్రీను పార్టీ కండువాలు వేసి పార్టీ లోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కొత్తగా చేరిన వారు మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై, మండపేటలో తోట త్రిమూర్తులు నాయకత్వంను బలపరుస్తూ వైఎస్సార్సీపీ లో చేరినట్లు చెప్పారు.
12 వ వార్డు లో వైస్సార్ అభ్యర్థి మలసాని సీత మహాలక్ష్మి విజయానికి కృషి చేస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో వైస్సార్ సిపి నేతలు యారమాటి వెంకన్నబాబు, శ్రీను, చింతలపూడి సత్యనారాయణ, వాసా ఈశ్వరరావు, కోటిపల్లి సర్పంచ్ పెమ్మాటి సత్తిబాబు, కార్యకర్తలు, అభిమానులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.