తిరుపతి ఉప ఎన్నికల్లో బోగస్ ఓటర్ల కలకలం
తిరుపతి పార్లమెంటు స్థానానికి నేడు ఉప ఎన్నిక జరుగుతున్న విషయం తెలింసందే.
అయితే ఈ ఎన్నికలో ఓట్లు వేసేందుకు బారులు తీరిన ఓటర్లలో తమ పూర్తి పేరు తమకే తెలియనివారు కొందరైతే, తమ తండ్రి పేరు తెలియని వారు మరికొందరు. ఇంకొందరికేమో తమ ఇంటి చిరునామా వివరాలు తెలియవు.
ఇంత అమాయకులు కూడా ఉంటారా అని మీరు అనుకుంటే తప్పులో కాలేసినట్లే వీరంతా దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన దొంగ ఓటర్లు మరి.
స్థానికంగా ఉన్న ఓటర్లు తమపార్టీకి ఓటు వేయరనుకున్నారో ఏమో గానీ పొరుగూర్లనుండి రప్పించి మరీ ఈ దొంగ ఓటర్ల చేత ఓట్లు వేయించే ప్రయత్నం జరుగుతోంది.
అధికార పార్టీ వారే ఈ దొంగ ఓటర్లను నియమించారని విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. అయితే ఇందులో నిజానిజాలు బయటకు రావలసి ఉంది.
ఈ రకంగా దొంగ ఓట్లు వేసేందుకు పోలింగ్ బూత్‌లలో బారులు తీరిన జనాలు వందల్లోనే దర్శనమిస్తున్నారు.
వీరిని కెమెరా ముఖంగా వివరాలు అడగగా తమ పేరు, తండ్రి పేరు కూడా సరిగా చెప్పలేక నీళ్ళు నువులుతున్నారు. మరి కొందరు వివరాలు అడగగానే చల్లగా జారుకుంటున్నారు.
ఇందులో అసలు ఓటర్లెంతమందో దొంగ ఓటర్లెంతమందో మరి ఆ తిరపతి వెంకన్నకే తెలియాలి.