బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి కి మద్దతు గా ప్రచారం…
మండపేట:-తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి బలపర్చిన అభ్యర్థి యిళ్ల సత్యనారాయణ కు మద్దతుగా మండపేటలో బీజేపీ గురువారం ప్రచారం నిర్వహించింది.
మొదటి ప్రాధాన్యత ఓటును వేసి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా యిళ్ళ సత్యనారాయణను గెలిపించాలని ఈ సందర్భంగా కోరారు.
మండపేట పట్టణంలో ఉన్న ఎస్ వి ఎస్ ఆర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజి, హైస్కూలు, జవహర్లాల్ మున్సిపల్ హైస్కూల్, గౌతమి హైస్కూలు, బాలికల హైస్కూలు, డిగ్రీకాలేజీలో ఉపాధ్యాయులను కలిసి ప్రచారం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో బిజెపి మండపేట నియోజకవర్గ కన్వీనర్ కోన సత్యనారాయణ, కపిలేశ్వరపురం మండల అధ్యక్షుడు తోరం రాము, జక్కా లక్ష్మీనారాయణ, చండ్రమళ్ల చిట్టియ్య పాల్గొన్నారు.