కన్నతల్లి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కొండమీది రాజన్ బాబు ఆధ్వర్యంలో ఉర్సు ప్రభుత్వ హైస్కూల్ పదవ తరగతి చదువుతున్న ఉర్దూ మీడియం తెలుగు మీడియం విద్యార్థిని విద్యార్థులకు పదో తరగతి పరీక్షలు దగ్గర పడుతున్న సమయంలో వారికి పరీక్ష ప్యాడు పెన్నులు పెన్నులు రబ్బరు అందజేశారు.
రాజన్ బాబు మాట్లాడుతు ఉరుసు ప్రభుత్వం పాఠశాలలో ఎవరైతే ఫస్టు ర్యాంకు తెచ్చుకుంటారు వారికి కన్నతల్లి ఫౌండేషన్ నుండి మంచి బహుమతి ఇవ్వడం జరుగుతుంది అని తెలియ జేశారు.
కష్టపడి బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలని తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కె.రమేష్ ఏ. శ్రీనివాస్, మహమద్ అరిఫ్, సంపత్ కిషన్, వెంకటస్వామి, రమేష్, వివేక్ తదితరులు పాల్గొన్నారు.
