అమరావతి : ఆక్సిజన్ కొరతపై ఏపీ సర్కార్ ఫోకస్
ఆక్సిజన్ డిమాండ్, సరఫరా అందుబాటుపై కసరత్తు
రోజురోజుకూ పెరిగిపోతున్న కరోనా కేసుల నేపధ్యంలో తలెత్తిన కొత్త సమస్య ఆక్సిజన్ కొరత, అయితే ఏపీ సర్కారు ఆక్సిజన్ కొరతపై ప్రత్యేక దృష్టి పెట్టింది.
పీక్ స్టేజ్‌లో ఏపిలో 200 టన్నుల ఆక్సిజన్ అవసరమని అధికారుల అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రోజుకు 80-100 టన్నుల ఆక్సిజన్ అవసరమంటున్న అధికారులు.
ఏపీకి నాలుగు ప్రాంతాల నుంచి ఆక్సిజన్ తెచ్చుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
విశాఖ స్టీల్‌ప్లాంట్, భువనేశ్వర్, బళ్లారి, చెన్నైల నుంచి ఆక్సిజన్ తెచ్చుకునేలా అధికారుల యాక్షన్ ప్లాన్ తో సిద్ధమౌతున్నారు.
విశాఖ నుంచి 80 టన్నులు, భువనేశ్వర్ నుంచి 70 టన్నుల సరఫరా చేసే ప్రణాలికలు రచిస్తున్నారు.
అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ఇప్పటికే ఆక్సిజన్ సరఫరా ప్రారంభించింది.