కోవిడ్ నివారణా చర్యలపై దుష్ప్రచారాల ఏపీ సీరియస్
వ్యాక్సినేషన్, కోవిడ్ నివారణా చర్యలపై దుష్ప్రచారాలను ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.
చంద్రబాబు, ఒక వర్గం మీడియా చేస్తున్న ప్రచారాలపై వస్తున్న పలు ఫిర్యాదుల నేపథ్యంలో చట్టప్రకారం చర్యలు తీసుకోనుంది ప్రభుత్వం.
ఈ ప్రచారాలు చేస్తున్న వ్యక్తులు, మీడియా సంస్థలపై చట్ట ప్రకారం చర్యలకు దిగనుంది ఏపీ ప్రభుత్వం. విపత్తు సమయంలో దురుద్దేశపూర్వక ప్రచారాలను తీవ్రంగా పరిగణిస్తోంది ఏపీ ప్రభుత్వం.
వాస్తవాలను మరుగునపరిచి, ప్రజలను తప్పుదోవపట్టించేలా వ్యాక్సినేషన్‌పై కథనాలు, ప్రచారాలు, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా ప్రచారాలు రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది సర్కార్.
చరిత్రలో మునుపెన్నడూ లేని విపత్తు సమయంలో విషమ పరిస్థితుల్లో సేవలందిస్తున్న సిబ్బంది నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా తప్పుడు ప్రచారాలు చేస్తున్న తీరుపైనా చట్టప్రకారం చర్యలు తీసుకోనుంది ఏపీ ప్రభుత్వం.