చెన్నై: ఎన్నికల్లో గెలవడానికి అభ్యర్ధలు ఎప్పుడూ కొత్త మార్గాలను అన్వేషిస్తుంటారు. అందులో భాగంగానే ఓటర్లను ఆకర్షించేందుక హామీలు కూడా గుప్పిస్తుంటారు.
తమిళనాడు ఎన్నికల్లో ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా ఎన్నికల్లో గెలిచెందుకు సంచలన హామీలు గుప్పించాడు.
ఎన్నికల్లో తాను గనుక విజంయ సాధిస్తే నియోజకవర్గ ప్రజలందర్ని విడతలవారీగా చంద్రమండలం పైకి పంపుతానని హామి ఇస్తున్నాడు.
అంతటితో ఆగలేదతడు, గెలిచాక నియోజకవర్గంలో ఏకంగా రాకెట్ ప్రయోగ కేంద్రం ఏర్పాటు చేస్తానంటున్నాడు.
మరి మహిళా ఓటర్లను ఆకర్షించడానికి కూడా ఇతగాడి దగ్గర ఉపాయం లేకపోలేదండోయ్, ఇళ్లల్లో ఆడవాళ్లు పనికి సాయంగా ఇంటింటికీ ఒక రోబో పంపిణీ చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు మరి.
అంతే కాదండోయి నియోజక వర్గ ప్రజలందరికీ ఐఫోన్ కూడా ఇస్తాడంట మరి.
అంతేనా, ట్రాఫిక్ రద్దీ తగ్గించడానికి కాల్వలు తవ్వించి ఇంటికో బోటు పంపిణీ చేస్తానంటున్నాడు సదరు అభ్యర్ధి.
ఇవన్నీ కాదండీ, అసలు సిసలు హామీ వినండి మరి ఎండ వేడి నుంచి నియోజకవర్గాన్ని కాపాడేందుకు 300 అడుగుల ఎత్తున కృత్రిమ మంచు కొండ నిర్మాణం చేపట్టడమే కాక, ప్రజలు ఎంజాయ్ చేయడానికి కృత్రిమ సముద్రాన్ని సైతం నిర్మిస్తానంటున్నాడండి.
అన్ని రాజకీయ పార్టీలు టికెట్ నిరాకరించడంతో దక్షిణ మధురై నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న శరవణన్ ఈ విధంగా హామీల వర్షం కురిపిస్తున్నాడు.
శరవణన్ హామీలు చూసి సామాన్య ప్రజలే కాదు రాజకీయ నేతలు సైతం ఆశ్చర్యపోతున్నారు.