18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి టీకా.. దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో టీకా పంపిణీని వేగవంతం చేసింది కేంద్రం.
మూడో దశ టీకా పంపిణీలో భాగంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరునికి టీకా అందించాలని కేంద్రం ప్రభుత్వం నిర్ణయించింది.
మే 1 నుంచి మూడో దశ టీకా పంపిణీ ప్రారంభమవుతుందని ప్రకటించింది.
మూడో విడత కరోనా వ్యాక్సిన్ మార్గదర్శకాలు
18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికీ కరోనా వ్యాక్సిన్.
50శాతం టీకాలు అమ్ముకునేందుకు ఉత్పత్తి సంస్థలకు కేంద్రం అనుమతి.
50శాతం టీకాలు రాష్ట్రాలకు, విపణిలో అమ్ముకోవచ్చు.
ఉత్పత్తి సంస్థలు టీకాలను మార్కెట్లో నిర్దేశిత ధరకు అమ్ముకోవచ్చు.
ఉత్పత్తి సంస్థలకు నుంచి టీకాలు నేరుగా కొనేందుకు రాష్ట్రాలను అనుమతి.
గతంలో ప్రకటించిన విధంగా ఫ్రంట్లైన్ వర్కర్లకు 45ఏళ్లు దాటిని వారికి కరోనా వ్యాక్సిన్ డ్రైవ్ యథావిధిగా కొనసాగుతుంది.