స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వెంటనే రద్దు చేయాలి ఏఐటీయూసీ డిమాండ్ చేసింది
బీజేపీ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ 100% ప్రైవేటీకరణనువెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గత 50 రోజులుగా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు చేస్తున్న నిరాహార దీక్షకు మద్దతుగా ఈరోజు, అనగా తేదీ 03.04.2021న ఉ.10గంటలకు రైల్వే స్టేషన్ ఇన్ గేట్ రోడ్లో శ్రీ విజయ దుర్గ ఆటో డ్రైవర్స్ నిరసన ధర్నా చేశారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏపిఆటో అండ్ మోటర్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.వామనమూర్తి పాల్గొని మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ముడురైతు వ్యవసాయక నల్ల చట్టాలను ఉపసంహరించుకోవాలని స్టీల్ ప్లాంట్ నిర్వాసితుల అందరికీ పర్మినెంట్ ఉద్యోగాలు కల్పించాలని పెంచిన పెట్రోల్ డీజిల్ వంటగ్యాస్ ధరలను రద్దు చేయాలని ప్రైవేట్ ఫైనాన్సర్లు వేస్తున్న ఓడిలు, వడ్డీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
లేనిపక్షంలో దశలవారీ ఆందోళనలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
కరోనా లాక్డౌన్ కాలంలో ఆటోల మీద పెట్టిన పోలీస్ కేసులను రద్దు చేయాలని, డ్రైవర్ల స్థానిక నివాసాల ప్రాతిపదికపై ఆటోలకు పోలీస్ నెంబర్లను ఇవ్వాలని కోరారు.
ఈ కార్యక్రమంలో : Y. వెంకట్, రవి కృష్ణ, CH.సత్తిబాబు, K.నూకరాజు, A.చంద్రశేఖర్, S. శ్రీను, H.శేఖర్, ఈశ్వరరావు K.రాము తదితరులు పాల్గొన్నారు.