విశాఖ: ఏసిబి వలలో భారీ అవినీతి చేప..
అక్రమ ఆస్తులు కుడబెట్టారనే ఆరోపణలు వెల్లువెత్తడంతో రణస్థలం పంచాయతీ ఎక్స్ టెన్షన్ ఆఫీసర్, పైడిభీమవరం పంచాయతీ సెక్రెటరీ గా విధులు నిర్వహిస్తున్న వెంకట్రావు పై ఏసిబి అధికారులు పంజా విసిరారు.
శ్రీకాకుళం ఏసిబి డీఎస్పీ రామమూర్తి ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించారు.
ఏసిబి అధికారులు చేపట్టిన ఈ తనిఖీల్లో భారీగా నగదు, విలువైన డాక్యుమెంట్లు గుర్తించినట్లు సమాచారం.