కోవిడ్ భాదిత కుటుంబానికి అభయం 20000 ఆర్థిక సాయం
టెక్కలిలో నెలకొన్న అభయం యువజన సేవాసంఘంలో సభ్యుడైన పోలాకి బాలరాజు కుటుంబ సభ్యులంతా ఇటీవల కోవిడ్ బారిన పడి ఇబ్బందుల్లో ఉన్నట్లు తెలుసుకున్న అభయం సేవాసంఘం వారు తమ సభ్యునికి చేయుతనివ్వాలనే ఆలోచనతో ఈ రోజు తన స్వగ్రామం విశ్వనాథపురం వెళ్లి, కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకుని మందుల ఖర్చుల నిమిత్తం 20 వేల రూపాయలను బాలరాజుకి అందజేసినట్లు అభయం యువజన సేవాసంఘం అధ్యక్షుడు దేవాది శ్రీనివాసరావు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అభయం యువజన సేవాసంఘం అధ్యక్షుడు దేవాది శ్రీనివాసరావుతో పాటు సంఘ సభ్యులు యన్ సింహాచలం, పి రమేష్, టి శివ, పి షణ్ముఖ రావు, బి అశోక్, యు గోవింద రావు పాల్గోన్నారు.