గడిచిన 24 గంటల్లో ఆంధ్ర ప్రదేశ్ లో 7055 డిశ్చార్జులు
గడిచిన 24 గంటల్లో ఆంధ్ర ప్రదేశ్ లో 11,434 కోవిడ్ -19 కేసులు నమోదు కాగా, 7055 మంది డిశ్చార్జ్ అయ్యారు, మరియు 64 మరణాలు సంభవించాయి.
ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 10,54,875 కాగా క్రియాశీల కేసుల సంఖ్య 99,446; డిస్చార్జైన కేసుల సంఖ్య 9,47,629 మరియు ఇప్పటివరకు సంభవించిన మొత్తం మరణాలు 7800.
నిన్నటి వరకు రాష్ట్రంలో మొత్తం 61,77,974 మోతాదుల కోవిడ్ వ్యాక్సిన్ అందించడం జరిగింది.
రాష్ట్రంలోని 40 పడకల ఆస్పత్రులను కోవిడ్ ఆస్పత్రులుగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
అంతేగాక, ప్రతి నియోజకవర్గంలో సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోనుంది రాష్ట్ర ప్రభుత్వం.
నియోజకవర్గ కేంద్రాల్లోని కళాశాలలను గుర్తించడంలో అధికారులు నిమగ్నమయ్యారు.
రోజుకు 12,000 రెమ్డెసివిర్ ఇంజెక్షన్లను పంపిణీ చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
ఇదిలా ఉండగా, టిటిడి పాలక వర్గం మే 1 నుండి తిరిగి ఆంక్షలను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.
ప్రస్తుతం రోజుకు 25 వేల మందికి ఉన్న దర్శన అవకాశాన్ని 15 వేలకు కుదించనున్నట్లు ఆలయ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తెలిపారు.