వజ్రపుకొత్తూరులో 38 అక్రమ మోటార్లు తొలగింపు
వజ్రపుకొత్తూరు మండలం అనంతగిరి పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి వెంకటాపురం, అనంతగిరి కాలనీలో 38 అక్రమ మోటార్లు తొలగించారు.
ప్రజా పంపిణీకి వేసిన ప్రభుత్వ కుళాయిలకు అక్రమంగా మోటార్లు అమర్చడంతో సుమారు 800 మంది ప్రజలకు తాగునీరు నిలిచిపోయింది.
ఈ సందర్భంగా మంగళవారం అధికారులు చర్యలు చేపట్టారు. వజ్రపుకొత్తూరు ఎస్ఐ గోవిందరావు ఎంపీడీవో ఈశ్వరమ్మ ఆర్డబ్ల్యూఎస్ అధికారులు గ్రామ సర్పంచ్ కాటకాన మల్లేశ్వరరావు, సచివాలయ ఉద్యోగులు ఇంటింటికీ తిరిగి ఈ మోటర్లను తొలగించారు.
అనంతరం, ఇకపై ఈ విధంగా ఎవరు మోటర్లు బిగించ కూడదని బిగించిన మెకానిక్, ఇంటి యజమానులు పై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
సోమవారం గ్రామంలోని వాటర్ ట్యాంక్ తాళాలు పగులగొట్టి మోటార్లను వేసిన వారందరికీ పిలిపించి హెచ్చరికలు జారీ చేశారు.
మోటారు తొలగింపుకు సహకరించిన రెండు గ్రామాల ప్రజలకు సర్పంచ్ మల్లేశ్వర స్వామి అధికారులు ధన్యవాదాలు తెలిపారు.