కర్ణాటకలో 14 రోజులు లాక్ డౌన్
కరోనా సెకండ్ వేవ్ విజృంభణ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
మంగళవారం (ఏప్రిల్-27,2021) రాత్రి 9గంటల నుంచి 14 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్ విధిస్తున్నట్లు యడియూరప్ప సర్కార్ ప్రకటించింది.
ప్రజలు నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసేందుకు ఉదయం 6 గంటల నుంచి 10వరకు అనుమతిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
10 గంటల తర్వాత షాపులు మూసివేయబడి ఉంటాయని తెలిపింది. ఆల్కహ్కాల్ లేదా మద్యం హోం డెలివరీకి అనుమతిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ప్రజా రవాణా వాహనాల రాకపోకలపై నిషేధం ఉంటుందని తెలిపింది. కేవలం నిర్మాణ, తయారీ, వ్యవసాయ రంగాలకు మాత్రమే తమ కార్యకలాపాలు కొనసాగించుకునేందుకు అనుమతిస్తున్నట్లు తెలిపింది.