ఎల్లో మీడియా తీరుపై విజయమ్మ బహిరంగ లేఖ
గత కొంత రాష్ట్రంలోని కొన్ని పార్టీలు, పత్రికలు, టీవీ ఛానళ్ళు తమపై తమకుటుంబంపై ప్రచురిస్తున్న, ప్రశారం చేస్తున్న అసత్యాలను కట్టుకథలను తిప్పిగొడుతూ వైయస్ విజయమ్మ ఈరోజు ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు.
ప్రజల్లో తన బిడ్డ, రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన వైయస్ జగన్ మోహన్ రెడ్డికి ఉన్న అఖండమైన అభిమానాన్ని చూసి సహించలేని ప్రత్యర్ధి నాయకులు వారికి అండగా కొమ్ము కాస్తున్న మీడియా సంస్థలు కావాలనే తమపైనా తమ కుటుంబంపైనా విషం జిమ్ముతున్నాయని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్ని ప్రయత్నాలు చేసినా తన స్థాయిని పెంచుకోలేనని తెలుసుకున్న చంద్రబాబు నాయుడు కావాలనే జగన్ మోహన్ రెడ్డిపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు.
తమ కుమార్తె షర్మీల రాజకీయ భవిష్యత్తు తెలంగాణాలో ఉన్నదని బలంగా నమ్మినందు వల్లనే తెలంగాణా కోడలిగా అక్కడి ప్రజలకు సేవ చేయాలని నిర్ణయించుకున్నదని ఆమె పైర్కొన్నారు.
అయితే ఇది సహించలేని పచ్చ మీడియా కెవలం ఇద్దరి మధ్య గల రెండు భిన్నమైన అభిప్రాయాలను విభేదాలుగా చూపించే ప్రయత్నం చేస్తున్నాయని ఆమె ఈ లేఖలో పేర్కొన్నారు.
తమ కుటుంబ సభ్యుడైన వైయస్ వివేకానంద రెడ్డి హత్యలో దోషులు ఎంతటి వరైన చట్టం ముందు నిలబెట్టి శిక్షించాలనేదే తమ కుటుంబంలోని ప్రతి ఒక్కరి అభిప్రాయమన్నారు.
ప్రజల్లో తమకు తమ కుటుంబానికీ గల ఆదరాభిమానాలను చూసి తట్టుకోలేక కడుపుమంటతో అన్నీ అసత్య కథనాలనే ప్రచురించే, ప్రశారం చేసే మీడియా సంస్థలు ఇలాంటి పనులు చేసేకంటే సంస్థలు మూసేసి వేరే ఇంకేమైనా పని చేసుకుంటే మేలని హితవు పలికారు.