చీరాలలో మహిళ దారుణ హత్య…
ప్రకాశం జిల్లా, చీరాల పట్టణం:- ప్రసాద్ సెంటర్ ముత్యాలపేటలో తోట కాత్యాయని(55) అనే వివాహిత దారుణహత్యకు గురైంది.
మృతురాలికి ఇద్దరు కుమారులు, భర్త వున్నారు. భర్త పేరు తోట వెంకట రమణ మూర్తి. ఇద్దరు కుమారులు హైద్రాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు.
మృతురాలి ఒంటిపై బంగారు ఆభరణాలు గల్లంతు. భర్త ఆర్ టీ సి లో కండక్టరుగా ఉద్యోగం చేసి స్వచ్ఛంద పదవీ విరమణ పొందారు.
సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ ను రంగంలోకి దింపనున్నారు.
