మంత్రాలయ మత్సకారులకు న్యాయం చేస్తాం. -మంత్రి అప్పలరాజు
రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడిపరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు.
స్థానిక ఎమ్మెల్యేతో మాట్లాడిన మంత్రి.
సమస్య పరిష్కారానికి చొరవ చూపాలి.
సాంప్రదాయ మత్స్యకారులకు ఆదుకుంటాం.
సాంప్రదాయ మత్స్యకారులను ఆదుకుంటామని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడిపరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు మంత్రాలయం మత్స్యకారులకు హామీ ఇచ్చారు.
మంగళవారం విజయవాడలోని మంత్రి నివాసానికి మంత్రాలయం మత్స్యకారులు చేరుకుని వారి సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
అర్హులైన మత్స్యకారులను చేప వేటకు వెళ్ళనీయకుండా అడ్డుపడుతున్నారని. అనర్హుయలైన మత్స్యకారులపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
వెంటనే మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు స్పందించి మంత్రాలయ నియోజకవర్గం ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి తో మాట్లాడారు. మత్స్యకారులకు న్యాయం చేయాలని సూచించారు.
అనర్హులైన మత్స్యకారులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సాంప్రదాయ మత్స్యకారులను కాపాడు కోవాల్సిన అవసరం ఉందని అన్నారు.
మత్స్యకారుల అభివృద్ది కోసం ఎన్నో పధకాలు ద్వారా సంక్షేమాన్ని అందిస్తున్నామని అవన్ని సాంప్రదాయ మత్స్యకారులకు లబ్ధి చేకూరే విదంగా ఉండాలని అన్నారు.
తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతాల్లో జరుగుతున్న సమస్యలుపై మరింత దృష్టి సారించాలని ఎమ్మెల్యే బాక నాగిరెడ్డి ని మంత్రి కోరారు. మంత్రిని కలిసిన వారిలో మంత్రాలయం నియోజకవర్గానికి చెందిన పలువురు మత్స్యకారులు ఉన్నారు.