భారతీయ విద్యార్ధులపై ఎందుకు చైనా ఇంత వివక్ష
స్టేట్ కౌన్సిల్ ఆఫ్ చైనాలో కౌన్సిలర్ అయిన డాక్టర్ హెన్రీ హుయావో వాంగ్ మాట్లాడుతూ, అంతర్జాతీయ విద్యార్థులను తిరిగి రావడానికి అనుమతించకపోవడం ద్వారా, చైనా ప్రతిష్ఠ అంతర్జాతీయంగా పతనమవుతందని, ప్రతికూల ప్రజాభిప్రాయాన్ని పొందడం చైనాకు చాలా చెడ్డదని అన్నారు.
రానున్న బీజింగ్ ఒలింపిక్స్ దృష్ట్యా అంతర్జాతీయ విద్యార్ధులను అనుమతించడం ఎంతో ముక్యం అని డాక్టర్ వాంగ్ అన్నారు.
ఈ విషయంలో చిన్నపాటి జాప్యం వల్ల సంభవించే ప్రతికూల ప్రభావాలను ఎత్తి చూపారు.
చైనా యొక్క మానవ హక్కుల రికార్డుపై పశ్చాత్య దేశాల విమర్శల కారణంగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ బహిష్కరణ పిలుపులను చైనా ఎదుర్కొంటోందని ఆయన అన్నారు.
ఈ ఆరోపణలను చైనా పదేపదే తిరస్కరిస్తున్నపటికీ, ఇటీవల వెలువడిన మీడియా నివేదికల ప్రకారం, యూరప్ మరియు ఉత్తర అమెరికా నుండి 11 దేశాల రాజకీయ నాయకుల బృందం ఈ ఆటల “దౌత్య బహిష్కరణ” కు పిలుపునిచ్చింది.
భారతీయ విద్యార్థులు చైనాకు తిరిగి రావడం ఆలస్యం కావడంపై డాక్టర్ వాంగ్ ఆందోళన వ్యక్తం చేశారు మరియు వారి డిమాండ్లు, సమస్యలు మరియు బాధలు నిజమైనవి అని అంగీకరించారు.
చైనాలో చదువుతున్న సుమారు 20000 మంది భారతీయ విద్యార్థులు తమ అధ్యయనాలను తిరిగి ప్రారంభించడానికి 17 నెలల నుండి చైనాకు తిరిగి రావడానికి చైనా ప్రభుత్వం అనుమతి కోసం వేచి ఉన్నారు.
మార్చి 2020 నుండి జూలై 2020 వరకు విదేశీ మరియు చైనీస్ విద్యార్థులు ఆన్లైన్లో తమ విద్యాభ్యాసం కొనసాగించారని, అయితే 2020 ఆగస్టు నుండి చైనా విద్యార్థులు క్యాంపస్‌కు తిరిగి వచ్చారు.
భారతీయ విద్యార్ధుల పలు అభ్యర్ధనలు చేసినప్పటికి తరచూ బీజింగ్ లోని భారత రాయబార కార్యాలంతో సంప్రదింపులు జరిపినప్పటికి చైనా ప్రభుత్వం నుండి సానుకాల ఫలితం లేకపోయింది.
శనివారం, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా విదేశాలలో చదువుతూ COVID-19 కారణంగా భారతదేశంలో చిక్కుకున్న భారతీయ విద్యార్థులు సంబంధిత సమస్యలపై OIA-II డివిజన్‌తో సంప్రదించవచ్చుని పేర్కొంది.
గత సెప్టెంబరులో, చైనా ప్రభుత్వం 50000 మంది దక్షిణ కొరియా విద్యార్థులను తిరిగి రావడానికి అనుమతించింది, అది కూడా టీకా లేకుండా.
యుఎస్ నుండి కొంతమంది విద్యార్థులను షాంఘైలో కూడా అనుమతించారు, కాని బీజింగ్‌లో చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ సమావేశాలలో పదేపదే మీడియా ప్రశ్నలు ఉన్నప్పటికీ ఇతర దేశాల విద్యార్థులు తీవ్రంగా నిర్లక్ష్యం చేయబడ్డారు.
గత 17 నెలల్లో డిగ్రీలు పూర్తి చేసిన విద్యార్థులు, తమ సామాను బదిలీ చేయడానికి కూడా విశ్వవిద్యాలయ అధికారులు సిద్ధంగా లేరని చెప్పారు.
ఇతర విద్యార్థులు కూడా తమ సామాను గురించి సరైన సమాచారం పొందడం లేదు.
చైనాకు తిరిగి రావడానికి ఎదురుచూస్తున్న అంతర్జాతీయ విద్యార్థులు (భారతీయ విద్యార్థులతో సహా) చైనా ప్రభుత్వాన్ని పిటిషన్ చేయడానికి పెద్ద ఎత్తున ఆన్లైన్లో ప్రచారం ప్రారంభించారు.
భారతదేశం మరియు చైనాల మధ్య సహకారం యొక్క సంభావ్యత మరియు ప్రాముఖ్యతను గుర్తుచేస్తూ డాక్టర్ వాంగ్, భారతదేశం మరియు చైనాలలో పరస్పర విద్యార్థుల, ప్రజలు మరియు పర్యాటక రంగం సహకారం అవసరం అన్నారు.
చైనా నుండి అధిక సంఖ్యలో పర్యాటకులు భారతదేశానికి వెళ్లాలని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇటీవల సంభవించిన కొద్దిపాటి కేసులు మినాహాయించి, కోవిడ్ నియంత్రణలో అత్యధికంగా విజయం సాధించిన చైనా ప్రభుత్వం ఎందుకు అంతర్జాతీయ విద్యార్ధులను తిరిగి వచ్చేందుకు అనుమతించి వారిని క్వారంటైన్ లో ఉంచి నిర్ధారిత COVID ప్రోటోకాల్స్ ప్రకారం వ్యవహరించే ఆలోచన చేయడంలేదో అర్ధం అవడంలేదు అన్నారు.
చైనా విద్యార్థులు చైనా ప్రభుత్వంలోని అన్ని COVID ప్రోటోకాల్‌లను అనుసరించడానికి సిద్ధంగా ఉన్నారని అంతర్జాతీయ విద్యార్థులు అభిప్రాయపడ్డారు.
ఈ విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు అని డాక్టర్ వాంగ్ అన్నారు. ఈ విషయంపై నిర్ణయం త్వరగా తీసుకోకుంటే ప్రతికూల ప్రజాభిప్రాయానికి దారితీస్తుందని, ఇది చాలా చెడ్డది ఆయన అన్నారు.