పరిషత్ ఎన్నికలపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తాం…
చట్టాన్ని చుట్టం చేసుకోవాలనుకుంటే న్యాయస్థానం చూస్తూ ఊరుకోదు…మాజీ మంత్రి కొత్తపల్లి జవహర్
పరిషత్ ఎన్నికల పై హైకోర్టు వెలువరిచిన తీర్పుపై కొత్తపల్లి జవహర్ హర్షం వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే
“జగన్ రెడ్డి తన అనుచరులతో చట్టాన్ని చుట్టం చేసుకోవాలనుకుంటే న్యాయస్థానం చూస్తూ ఊరుకోదని వందకు పైగా పడిన మొట్టికాయలతో పాటు నేడు హైకోర్టు తీర్పు కూడా చూసుకోవచ్చు.
సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల ఆధారంగా నాలుగు వారాల గడువు వుండేలా టీడీపీ కోరింది. నీలం సాహ్ని రబ్బరు స్టాంప్ అని యావత్ రాష్ట్రానికి తెలిసింది.
మహిళా సాధికారిత సాధించాల్సిన అధికారి జగన్ రెడ్డి పాదసేవ చేస్తూ, మోచేతినీళ్లు తాగడానికి అలవాటు పడిన నీలం సాహ్ని ఇచ్చిన నోటిఫికేషన్ పై స్టే ఇవ్వడం ఊహించిందే.
టీడీపీ పరిషత్ ఎన్నికలను బహిష్కరించింది కూడా ఇందుకోసమే. దొంగలు, పోలీసులు ఒకటయ్యి ఆటాడుతున్నారు.
ప్రేక్షకపాత్ర వహించడం సరికాదని ప్రజాస్వామ్య పరిరక్షణకు టీడీపీ కఠినమైన బహిష్కరణ నిర్ణయం తీసుకుంది.
టీడీపీ కోర్టుకు వెళ్లి ప్రజాస్వామ్యాన్ని కాపాడి రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుంది.
పనికిమాలిన కొడాలి నాని, పేర్ని నాని ఎవరు రాజీనామా చేస్తారో చేయాలి.
హైకోర్టు తీర్పు మీకు చెంపపెట్టు లాంటింది. జగన్ కు నైతిక విలువలుంటే పదవి నుండి దిగిపోవాలి.
హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. జరిగిన లోపాలను సరిదిద్దుకుని కొత్త నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలి.”