కేంద్రం ప్రకటించిన విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవెటీకరణకు వ్యతిరేకంగా కర్మాగరం ఉద్యోగులు గత 32 రోజులుగా రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు.
అయితే, ఈ దీక్షకు మెగాస్టార్ చిరంజీవి తన మద్దతు తెలిపుతూ కేంద్ర తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవలసిందిగా కోరుతూ ట్వీట్ చేసిన విషయం తెలిసింది.
విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల దీక్షకు మద్దతు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి చిత్రపటానికి స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు పాలాభిషేకం చేసి తమ గౌరవాన్ని అభిమానాన్ని వ్యక్తం చేసారు.
విశాఖ గాజువాక కూర్మన్నపాలేం జంక్షన్ వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.