ఆ మృతదేహాన్ని మా గ్రామానికి తేవద్దు….!
పలాస మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన ఒకాయన విశాఖ ఆసుపత్రిలో కరోనా లక్షణాలుతో మృతి చెందాడు.
కుటుంబ సభ్యులు ఆ మృతదేహానికి స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించాలని ఓ ప్రవేటు వాహనంలో బయలుదేరారు.
గ్రామం మధ్యగా వెళితే గాని స్మశానానికి త్రోవలేదు. ఐతే, విషయం తెలుసుకున్న గ్రామస్థులు ఆ మృతదేహాన్ని గ్రామంలోకి రానివ్వకుండా ముందస్తు పహారా కాశారు.
ఇక ప్రక్క గ్రామమైన వజ్రపుకొత్తూరు మండలం మర్రిపాడు గ్రామం నుంచి మృతదేహానికి తెస్తారేమో అని అక్కడ గ్రామస్తులు ప్రహారా కాస్తు కూర్చున్నారు.
విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకున్నారు.