వేగుళ్ళ లీలాకృష్ణ ప్రచారం..
మండపేట:- పురపాలక సంఘ ఎన్నికలలో భాగంగా మండపేట 10వ వార్డులో జనసేన కౌన్సిలర్ అభ్యర్థి టంకాల చిన్ని కు మద్దతుగా గురువారం జనసేనపార్టీ ఇంచార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ , వల్లూరు సర్పంచ్ దాసి మీనా కుమారి లు ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు వార్డులో పర్యటించారు. తొలుత కొండపల్లి వారి వీధిలో ప్రసిద్ధి చెందిన దుర్గమ్మ తల్లి ఆలయంలో పూజలు నిర్వహించారు.
జనసైనికులు కోలాహలంగా ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్ళి జనసేనపార్టీ అభ్యర్థి టంకాల చిన్నికు మునిసిపల్ ఎన్నికల్లో గాజు గ్లాస్ గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో జనసేన అధికార ప్రతినిధిలు శెట్టి రవి, నామాల చంద్రరావు, కొంతం నాగేంద్ర ప్రసాద్, గోళ్ళ శ్రీను, ద్వారపూడి చింత శ్రీను, చింత శ్రీను (ద్వారపూడి), మోరం బాలాజీ, కనపర్తి వీర్రాజు, బండారు సతీష్, కొనాల చంద్రబోస్, పైడమళ్ళ సతీష్, గండి రాజు, వెలగదుర్తి శ్రీను, టంకాల సాయి, బర్రె కిషోర్, సాధనాల సురేష్, సుంకర మణికంఠ, టంకాల మణికంఠ, కొత్తపల్లి కళ్యాణ్, వీరమహిళలు శెట్టి వరలక్ష్మి, జొన్నడ పాపయమ్మ సోమేశ్వరం జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.