కరోనా ఉధృతితో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత్ పర్యటన రద్దు
భారతదేశంలో నానాటికి పెరుగుతున్న కరోనా ఉధృతి దృష్ట్యా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తన భారత పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు ఆయన కార్యాలయ వర్గాలు ఈ రోజు ప్రకటించాయి.
గతంలో కూడా జనవరిలో బోరిస్ పర్యటించవలసి ఉండగా అప్పడు బ్రిటన్ లో ఉన్న కోవిడ్-19 ఉధృతి కారణంగా ఆ పర్యటన రద్దయింది.
అయితే ఇప్పుడు తాజాగా మన దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా మరోసారి ఆయన పర్యటన రద్దు అవడం గమనార్హం.
భారతదేశంలో ప్రస్తుతం సెకండ్ వేవ్ కారణంగా వైరస్ వ్యాప్తి ప్రబలంగా ఉంది.
జూన్‌లో నిర్వహించనున్న జి 7 శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావాలని బ్రిటన్ భారత్‌ను ఆహ్వానించింది.
భారతదేశంలో ఉద్భవించిన COVID-19 వేరియంట్‌పై తాము దర్యాప్తు చేస్తున్నామని బ్రిటిష్ ఆరోగ్య అధికారులు ఆదివారం తెలిపారు, అయితే ఇంకా వాటిని వర్గీకరించడానికి తగిన ఆధారాలు లేవని తెలిపారు.