వరంగల్ లోని హన్మకొండ SV కన్వెన్షన్ హాల్ లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ TRS పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర గిరిజన సంక్షేమం, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ:
మొన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ గా పల్లా రాజేశ్వర రెడ్డి ని గెలిపించిన ప్రతి ఒక్కరి కి పేరు పేరునా తల వంచి నమస్కరిస్తున్నను అన్నారు
ఎగిరెగిరి పడ్డ వాళ్ళను ప్రజలు దభేల్ మని పడేశారు. నేలకు వేసి కొట్టారు పాల పొంగులా వాళ్ళ ఉబ్బు తీరా ఓడించారు అంటూ విపక్షాలను ఎద్దేవా చేశారు.
ఏడాదికి 2కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, ఇప్పటివరకు ఒక్క ఉద్యోగం ఇవ్వని బీజేపీ అనీ, అటువంటి బీజేపీ రెచ్చగొట్టి సునీల్ నాయక్ ఉసురు తీసిందని, బీజేపీ నిరుద్యోగులకు సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు.
సిగ్గు లేకుండా, మన పార్టీ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు రైల్వే ప్లాట్ ఫారం మీద టీ అమ్మిన మోడీ ఆ రైల్వే ను అమ్మేశాడు అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తే, ఇక ఉద్యోగాలు వస్తాయా? అంటూ ఘాటుగా ప్రశ్నించారు.
రిజర్వేషన్లు వస్తాయా? ఎప్పటికీ రావు కన్న తల్లి లాంటి పార్టీ టిఆర్ఎస్ తో అడిగి సాధించాలే తప్ప అన్యాయం చేయొద్దు అంటూ పార్టీ కార్యకర్తలకు పదవులు కావాలని సీఎం కెసిఆర్ ను మొన్న అడుగగా, వెంటనే సీఎం కెసిఆర్ సరే అన్నారు అని తెలియజేశారు.
త్వరలోనే వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు వస్తాయని. అందుకు సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఉగాది నుండి వరంగల్ మహా నగరంలో ఇంటింటికీ మంచినీరు అందిస్తున్నామని తెలియజేశారు. *అంబేద్కర్ జయంతి రోజు ఈ నెల 14న ఈ కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారని అన్నారు.
వేలాది కోట్లతో వరంగల్ ని అభివృద్ధి చేస్తున్నాం
ప్రతి ఒక్క కుటుంబానికి కనీసం 5 లక్షల లబ్ధి చేకూరే విధంగా ఎంపవర్మెంట్ స్కీంని త్వరలోనే ప్రారంభిస్తున్నామని చెప్పారు.
పార్టీ అధిష్ఠానం నిర్ణయించే అభ్యర్థులు అందరినీ గెలిపించాలని, బీజేపీ, కాంగ్రెస్ వంటి పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని, వాటికి అడ్రస్ లేకుండా చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
పార్టీని విజయ పథంలో నడిపే బాధ్యత పార్టీ కార్యకర్తలదేని, పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత నాది అని హామి ఇచ్చారు.
ఈ సందర్భంగా కొత్త, పాత 31వ డివిజన్ లలో ఉదయ్ కుమార్, సాయి తదితరుల నేతృత్వంలో భారీ ఎత్తున బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆ పార్టీ కి రాజీనామా చేసి TRS లో చేరారు.
ఈ సమావేశంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.