మండపేటలో తోట హవా…
పుర ఎన్నికల్లో రాణికి మద్దతుగా ప్రచారం…
అడుగడుగునా పూలవర్షం… మారుతున్న సమీకరణలు…
మండపేట:- మండపేట నియోజకవర్గ వైకాపా ఇన్ చార్జ్ తోట త్రిమూర్తులు హవా మునిసిపల్ ఎన్నికల్లో స్పష్టం గా కనిపిస్తుంది.
మండపేట వైఎస్సార్ సీపీ చైర్మన్ అభ్యర్థి పతివాడ నూక దుర్గా రాణి గెలుపు కోరుతూ పలు వార్డుల్లో బుధవారం ఆయన పర్యటించారు. 18 ,21వ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయా వార్డుల్లో ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు ఆయన పై పూలవర్షం కురిపించారు. హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. పలుచోట్ల యువకులు ఆయనతో సెల్ఫీల కోసం ఉత్సాహం కనబరిచారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం వైస్సార్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.
మండపేట ప్రజలు మార్పు కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఇన్నేళ్లు అభివృద్ధి మాటున ప్రజలను టిడిపి నేతలు మోసాగించారని ఆరోపించారు.
మండపేట అర్ధంతరంగా నిలిచిపోయాయిన కమ్యూనిటీ హాళ్ళు నిర్మాణం కు కృషి చేస్తానని తెలిపారు. పట్టణాన్ని విస్తరించే క్రమంలో కొత్తగా రింగ్ రోడ్డు అభివృద్ధి చేస్తామని చెప్పారు.
మునిసిపల్ కార్యాలయం ఎదుట ఉన్న పార్కు మల్టీ వాణిజ్య సముదాయం గా నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
వైస్సార్ సిపి అభ్యర్థులకు ఫ్యాన్ గుర్తు పై ఓట్లు వేసి అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని విజ్ఞప్తి చేసారు.
ఆయా వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులు నాయుడు లక్ష్మీ సౌజన్య, కంది నాగ శ్రీదేవి ల తో కలసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు.
ఈ ప్రచారం లో వైస్సార్ సిపి నేతలు వేగుళ్ళ పట్టాభి రామయ్య చౌదరి, రెడ్డి రాధా కృష్ణ, సయ్యద్ రబ్బానీ, కొమ్ము రాంబాబు, మీగడ శ్రీనివాస్, గంగుమళ్ల శ్రీనివాస్, అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.