ఆనందంలో ఉన్నప్పుడు కాదు కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను గుర్తు చేసుకోండి మీకు అండగా నేనుంటాను – తోట త్రిమూర్తులు
అందరికీ ఇళ్ళు త్వరలో ఇస్తాం.. 15 రోజుల్లో పూర్తి చేయగలరా…?
గొల్లపుంత అపార్టుమెంట్లు వద్ద తోట సభ…
మండపేట:- మండపేట పట్టణంలో గొల్లపుంతలో నిర్మించిన అందరికీ ఇళ్ళు టిడ్కో అపార్టుమెంట్లు వద్ద గురువారం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఎన్నికల బహిరంగ సభ నిర్వహించారు.
ఈ సందర్భంగా మండపేట నియోజకవర్గ వైఎస్సార్సీపీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ గొల్లపుంత టిడ్కో ఇళ్ళు కు సంబంధించిన దుష్ప్రచారం అడ్డుకునేందుకు, ఇక్కడి వాస్తవ పరిస్థితులను ప్రజల కళ్ళకు కట్టినట్లు చూపించేందుకు ఇక్కడ సభ ఏర్పాటు చేశామన్నారు.
ఆనందంగా వున్నప్పుడు తోట ను గుర్తు తెచ్చుకోవద్దని కష్టం ఉన్నప్పుడు తనను తలుచుకోవాలని తక్షణమే కష్టాల్లో భాగస్వామి అవుతానని, ఏ ఆపద వచ్చిన ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
మునిసిపాలిటీ కి టిడ్కో ఇళ్లకు ఎలాంటి సంబంధం లేకపోయినా టీడీపీ నేతలు అబద్ధాలు, అసత్యాలు నోటికి వచ్చినట్లు చెబుతున్నారని ఆరోపించారు.
వాస్తవానికి ఈ అపార్టుమెంట్లు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వంకు సంబంధించిన అంశం కాగా 15 రోజుల్లో సౌకర్యాలు కల్పించి ఇస్తామని సాధ్యం కాని హామీ ఇస్తున్నారని విమర్శించారు.
ఇక్కడ పరిస్థితి చుస్తే ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోయి ఉన్నాయన్నారు. ఇక్కడ అన్ని సౌకర్యాలు సంపూర్ణంగా ఏర్పాటు చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాటిని సాధ్యమైనంత త్వరలో అప్పగిస్తామని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బిక్కిన కృష్ణర్జున చౌదరి, వైఎస్సార్సీపీ నేతలు రెడ్డి రాధాకృష్ణ, వేగుళ్ళ పట్టాభి రామయ్య చౌదరి, కొమ్ము రాంబాబు, ముమ్మిడివరపు బాపిరాజు, అన్ని వార్డుల వైస్సార్ సిపి కౌన్సిలర్ లు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.