ఆ పాప బ్రతుకులో వెలుగులు నింపుతున్న హెల్ప్ గ్రూప్
తూర్పుగోదావరి జిల్లా, తొండంగి గ్రామంలో ఉమా లక్ష్మీ అనే 7 ఏళ్ళ పాప డయాబెటిస్ తో బాధపడుతోంది. పాపకు నాలుగు సంవత్సరాల వయసులో అనారోగ్యంతో ఆసుపత్రికి తీసుకువెళ్తే , అన్ని పరీక్షలు జరిపి షుగరు అని చెప్పారు.
చిన్న పాపకు షుగరు ఏమిటని అనుకున్నారు అందరూ. అప్పటి నుంచి ప్రతి రోజు మూడుసార్లు ఇన్సులిన్ పొట్టపై, చేతికి, మొదలగు చోట్ల చేయాల్సివస్తోందని అన్నారు తల్లిదండ్రులు.
పాప తండ్రి ఒక రోజు కూలి కాగా ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతను పనికి వెళ్లలేని పరిస్థితి. పాపకు ఈరోజు ఇన్సులిన్ ఇవ్వకపోయినా కళ్ళు తిరిగి రోడ్డు మీదో, స్కూలులోనో పడిపోతుంది.
వీరి పరిస్థితి తెలుసుకుని హెల్ప్ గ్రూప్ సంస్థ పాపను ఆదుకోవడానికి ముందుకువచ్చింది. దాతల నుండి పాతికవేలు సేకరించి పాప వైద్య ఖర్చులు నిమిత్తము అందించారు.
పాపకు భవిష్యత్తులో వైద్యానికి అవసరమైన నిధులు అందిస్తామని తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు.