తెలంగాణాలో క్రమక్రమంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది..
ప్రజల ఆరోగ్య పరిరక్షణకు తీసుకోవాలసిన చర్యలపై ముఖ్యమంత్రి కెసిఆర్ ఉన్నతాధికారులతోనూ, అందుబాటులో ఉన్న మంత్రులుతోనూ చర్చలు జరుపుతున్నారు..
లాక్ డౌన్ పై చర్చించేందుకు నేటి ఉదయం మంత్రి కెటిఆర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేంద్ర తో కలసి ప్రగతి భవన్ లో చర్చించారు..
కెటిఆర్, ఈటల అసెంబ్లీ నుంచి నేరుగా ప్రగతి భవన్కు వెళ్లి చర్చలలో పాల్గొన్నారు..
లాక్ డౌన్ పై రేపు కేసిఆర్ అసెంబ్లీలో ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది..
ఇప్పటికే 1 నుంచి 8వ తరగతి వరకు విద్యార్థుల్ని పైతరగతులకు ప్రమోట్ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.
పాఠశాలల మూసివేతకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది.