ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ ఇస్తేనే ఆ ప్రక్రియలో పాల్గొంటాం..లేదంటే నిరసన తెలుపుతూ ఎన్నికలను బహిష్కరిస్తాం…
ఏపీలో వ్యవస్థలను సర్వ నాశనం చేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి..
కీలక పదవుల్లో ఉన్న వారు కీలుబొమ్మలుగా మారడం దురదృష్టకరం..
సీఎం ముఖ్య సలహాదారుగా పనిచేసిన అధికారి ఆధ్వర్యంలో ఎన్నికలు నిష్పక్షపాతంగా జరుగుతాయని మాకు నమ్మకం లేదు..
ఎన్నికల కమిషన్ మీద విశ్వసనీయత కోల్పోయే పరిస్థితులు తేవడం బాధాకరం..
ఎన్నికల కమిషనర్ గా రిటైర్డ్ ఐఏఎస్ లు సరికాదని, విశ్రాంత న్యాయమూర్తులను నియమించాలని కనగరాజ్ నియామక సమయంలో సందేశమిచ్చిన జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడేమైంది..
నెల్లూరులో మీడియాతో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి…
రాష్ట్ర ఎన్నికల కమీషనర్‌గా ముఖ్యమంత్రి మాజీ ముఖ్య సలహాదారును నియమించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు తేదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఢిల్లీకి చెందిన నీలం సాహ్నీపై సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక అభిమానం చూపిస్తున్నారు.
సీఎస్ గా రిటైర్డ్ అయిన వెంటనే తన సలహాదారుగా నియమించుకున్నారు..ఆ వెంటనే రాజ్యాంగబద్ధ సంస్థ అయిన స్టేట్ ఎన్నికల కమిషనర్ గా నియమించారు..
ఆమె బాధ్యతలు చేపట్టడానికి మూడు రోజులు ముందే మంత్రులు, బ్లూ మీడియా ప్రకటించిన మేరకు ఎన్నికల ప్రక్రియను నిమిషాల్లో ఖరారు చేసి స్వామి భక్తిని చాటుకున్నారు..
మీరు ఏమి కావాలన్నా ప్రకటించుకోండి..నేను సంతకం పెట్టేస్తానని ధోరణిలో ఆమె ఉండటం దురదృష్టకరం..
అదేమీ ఆషామాషీ పోస్టు కాదు..స్వతంత్రంగా వ్యవహరించాల్సిన స్థానంలో కూర్చున్నాక కనీసం సమీక్ష నిర్వహించారా..
గతంలో ఏం జరిగింది….రాజకీయ పార్టీలు ఏం కోరాయి..అనే విషయం తెలుసుకున్నారా…
జగన్మోహన్ రెడ్డి పీఏ ఏం చెబితే దాని మీద ఆమె సంతకం పెట్టాలి..
మంత్రులు షెడ్యూల్ ప్రకటిస్తే ఆమె సంతకం చేసి ఆర్డర్ ఇస్తారు..ఇలా కీలుబొమ్మగా మారితే ఎలా..
ఏపీలో స్టేట్ ఎన్నికల కమిషన్ లేదని అర్ధమవుతోంది..
నీలంసాహ్ని సీఎస్ గా ఉన్న సమయంలో కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉంది..ఎన్నికలు ఇప్పుడు జరగకుంటే మంచిదని ఎలక్షన్ కమిషన్ కు ఒక లేఖరాశారు..
ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ కాగానే కోవిడ్ సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్న సమయంలో కనీసం సంబంధిత అధికారులతో సమీక్ష కూడా చేయకుండానే గంటల్లో ఎన్నికల ప్రకటన ఇచ్చారు.
నిష్పక్షపాతంగా ఉండాల్సిన ఇలాంటి వ్యవస్థల్లో రిటైర్డ్ ఐఏఎస్ అధికారులను నియమించకూడదని, రిటైర్డ్ న్యాయమూర్తులను నియమించినప్పుడే న్యాయం జరుగుతుందని గతంలో సీఎం జగన్మోహన్ రెడ్డి సెలవిచ్చారు…..ఇప్పుడు మళ్లీ ఏమైందో..
నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడానికి కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని అప్పుడే కోరాం..లేదంటే ఎన్నికలు బహిష్కరిస్తామని 2020 మార్చి 15న మేం నెల్లూరులో మీడియా సమావేశంలో ప్రకటించాం..
ఈ ఏడాదిలో 100 మందికి పైగా వివిధ పార్టీల అభ్యర్థులు చనిపోయారు..కొందరు మహిళా అభ్యర్థులు పెళ్లిళ్లు చేసుకుని అత్తగారిళ్లకు వెళ్లిపోయారు..
13 నెలల తర్వాత పొరపాట్లను సరిదిద్దాల్సిందిపోయి పాత నోటిఫికేషన్ ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తారా..
కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలకు పోయే దమ్ము వైసీపీ ప్రభుత్వానికి లేదు..
ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పరిరక్షణ కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది..
ప్రజాస్వామ్యం అనే పదానికి అర్థమేంటో ఈ ప్రభుత్వానికి తెలియకుండా పోయింది..
రాష్ట్రంలో దురదృష్టకరమైన పరిణామాలు, క్షమించరాని పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి..
రోజులన్నీ ఒకేలా ఉండవు…నియంతృత్వం ఎక్కువ కాలం చెల్లదు….ప్రజలు తిరగబడే రోజు త్వరలోనే ఉంది..” అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.
ఈ సమావేశంలో టీడీపీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు పంతగాని నరసింహ ప్రసాద్, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు తాళ్లపాక అనూరాధ, జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి, సీనియర్ నేత కుంకాల దశరధనాగేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.