వరంగల్ మహానగరం 5వ డివిజన్ ( హన్మకొండ కొత్తూరు జెండా, కుమార్ పల్లి మార్కెట్, తోటబడి, దాసరి వాడ ప్రాంతం) లో ఎన్నికల్లో పోటీ చేస్తున్న తాడిశెట్టి క్రాంతి కుమార్కు మద్దతుగా ఈ రోజు ప్రచారంలో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పటేల్ వనజక్క, బి.ఎల్.ఎఫ్. వరంగల్ పార్లమెంటు కన్వీనర్ సాయిని నరందేర్, రజక రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు చాపర్తి కుమారస్వామి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
“గత 20 సంవత్సరాలుగా కొత్తూరు జాక్ పేరుతో తెలంగాణ ఉద్యమంతో పాటు బహుజన మహానుభావుల జయంతి, వర్ధంతి కార్యక్రమాలు క్రమం తప్పకుండా చేస్తున్న క్రాంతి కుమార్ కుటుంబం ఈ సారి మహానగర పాలక ఎన్నికల్లో పోటీలో ఉంది.
నిజాయితి, అంకితభావం, క్రమశిక్షణ, సోదరభావం, కరుణ, ప్రేమ, తెగువ మెండుగా కలిగి ఈర్ష్య, ద్వేషాలను వొదలి ప్రజల చైతన్యం కోసం కృషి చేస్తున్న క్రాంతి కుమార్ సింహం గుర్తుపై ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి.
స్వార్ధ రాజకీయాల స్థానంలో విలువల రాజకీయాల నిర్మాణం కోసం తాడిశెట్టి క్రాంతి కుమార్ ను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ప్రత్యేకించి యువతపై ఉంది.” అని ప్రజలను కోరారు.