కరోనాకు ఇంజెక్షన్ బదులు టాబ్లెట్…
చివరి దశకు చేరుకున్న ట్రయల్స్
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారితో సీరియస్ అవుతున్న పేషెంట్లకు ఇప్పుడు రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లతో ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే దానిని టాబ్లెట్ల రూపంలో ఇచ్చేందుకూ ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇదే క్రమంలో మరో ‘టాబ్లెట్’ కరోనాను తగ్గిస్తోందట. ఇప్పటికే ఫ్లూ కోసం వాడుతున్న మోల్నుపిరావిర్ (ఎంకే 4482) అనే మందు హామ్స్టర్స్ (ఓ రకం ఎలుకలు) పై బాగా పనిచేస్తోందట.
అమెరికాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్ఐహెచ్) కు చెందిన సైంటిస్టులు ఎలుకలకు ఈ మందులిచ్చి చూడగా మంచి ఫలితాలు వచ్చినట్టు తేలింది.
వైరస్ సోకడానికి 12 గంటల ముందు, సోకిన 12 గంటల తర్వాత కూడా మోల్నుపిరావిర్ బాగా పనిచేస్తోందని సైంటిస్టులు చెబుతున్నారు.
కరోనా మహమ్మారి లంగ్స్‌కు చేసే చెడును కూడా చాలా వరకు తగ్గించగలిగిందని అంటున్నారు. కాబట్టి కరోనా బాధితులకు మోల్నుపిరావిర్‌తో ట్రీట్మెంట్ చేస్తే మహమ్మారి తీవ్రతను తగ్గించొచ్చని సిఫార్సు చేస్తున్నారు.
మనుషులపై ఈ మందు పనితీరును తెలుసుకునేందుకు చేస్తున్న క్లినికల్ ట్రయల్స్తుది దశకు చేరుకున్నాయని చెప్పారు. మొత్తం ట్రయల్స్ పూర్తయ్యాక మోల్నుపిరావిర్ పనితీరును వెల్లడిస్తామని చెప్పారు.