వైసీపీ గూటికి టిడిపి కౌన్సిలర్ అభ్యర్థులు.
శ్రీకాకుళం…..బిగ్ బ్రేకింగ్…
వైసీపీ గూటికి టిడిపి కౌన్సిలర్ అభ్యర్థులు.
మంత్రి అప్పలరాజు సమక్షంలో వైసీపీ కండువా వేసుకున్న నలుగురు టిడిపి అభ్యర్థులు.
శ్రీకాకుళం జిల్లాల్లో మున్సిపల్ ఎన్నికలు కాకుండానే టిడిపికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఎన్నికలు సమీపిస్తున్న కొలది అనూహ్యంగా రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి.
టిడిపి కౌన్సిలర్ అభ్యర్థులుగా నామినేషన్ వేసిన నలుగురు అభ్యర్థులు మంత్రి సిధిరి అప్పలరాజు క్యాంపు కార్యాలయంలో వైసీపీ కండువాలు వేడుకున్నారు.
మార్చి మూడో తేదీన జరగబోయే నామినేషన్ల ఉపసంహరణలో తమ నామినేషన్లు ఉపసంహరించుకుంటామని మంత్రికి ఈ సందర్భంగా మంత్రికి హామీ ఇచ్చారు.
వైసీపీ కండువాలు కప్పుకున్న వారిలో నాలుగో వార్డు నుండి టీడీపీ తరుపున నామినేషన్ వేసిన వాయిలపల్లి లక్షణ రావు, 5 వార్ధు నుండి టిడిపి అభ్యర్థి రోణంకి మురళి, 20 వార్ధు నుండి బమ్మిడి లక్ష్మి, 29 వార్ధు నుండి సనపల హరిలు ఉన్నారు.
పార్టీ కండువాలు మార్చుకున్న టిడిపి కౌన్సిల్ అభ్యర్థులు.
మంత్రి సిదిరి అప్పలరాజు సమక్షంలో వైసీపీ కండువాలు వేసుకున్న నలుగురు టిడిపి కౌన్సిల్ అభ్యర్థులు మంత్రి అప్పలరాజు మున్సిపాల్టిలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీ మారుతున్నట్లు ప్రకటించారు.
నామినేషన్లు ఉపసంహరణకు మరో రెండు రోజుల వ్యవది ఉన్నందున మరిన్ని సమీకరణాలు జరగనున్నట్లు సమాచారం.