జోగుళాంబ గద్వాల్ జిల్లా: ఆదివారం జరుగబోయే MLC ఎన్నికల దృష్ట్యా ఎన్నికలను ఇన్సిడెంట్ ఫ్రీ గా నిర్వహించేందుకు ఎన్నికల విధుల్లో పాల్గొనే పోలీస్ సిబ్బందికి పాటించాల్సిన నియమాలు, తీసుకోవలసిన జాగ్రత్తలపై జిల్లా ఎస్పీ శ్రీ జె. రంజన్ రతన్ కుమార్ గారు బ్రీఫింగ్ ఇవ్వడం జరిగింది.
జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల దగ్గర విధులు నిర్వహించే సిబ్బంది తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని, అలాగే ఓటర్లు కోవిడ్ నిబంధనలు పాటించేటట్లు చూసుకోవాలని సూచించారు.
పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరం వరకు ఎవరు గుమికూడకుండా చూసుకోవాలని, పోలింగ్ కేంద్రం లోపలికి నిషేధిత వస్తువులు అయిన అగ్గిపెట్టే, రసాయన ఇంకు బాటిల్స్, వాటర్ బాటిల్స్ వంటివి తీసుకెళ్ళనియకుండా అప్రమత్తంగా ఉండాలని తెలియజేసారు.
ఓటర్లు క్యూ లైన్లో భౌతిక దూరం పాటించేటట్లు చూడాలని, గుర్తింపు కార్డులు ఉన్న పోలింగ్ ఎజెంట్లను మాత్రమే పి. ఓ అనుమతి మేరకు లోపలికి పంపాలని, పరిసర ప్రాంతాల్లో ప్రచారం చేయడం, ఓటర్లను ప్రభావితం చేయడం , బెదిరింపులకు పాల్పడటం వంటివి జరుగకుండా చూసుకోవాలని పేర్కొన్నారు.
ఏదయినా సంఘటన జరిగిన ,శాంతిభద్రతల సమస్య తలెత్తిన వెంటనే మొబైల్ పార్టీకి గాని, సంబంధిత అధికారికి తెలియజేయాలని సూచించారు.
ఎన్నికల సిబ్బంది డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుండి బ్యాలెట్ బాక్స్‌లను బస్సులలో తీసుకెళ్లడం జరుగుతుందని నియమించబడిన రూట్ మొబైల్ పార్టీ సిబ్బంది ఆయా బస్సులకు రక్షణగా ఉంటూ బ్యాలెట్ బాక్స్‌లను సురక్షితంగా ఆయా పోలింగ్ స్టేషన్లకు చేర్చాలని, ఎన్నికల అనంతరం ఎన్నికల సిబ్బంది పోలింగ్ మెటీరియల్, బాక్స్‌లను బస్సులలో కౌంటింగ్ కేంద్రాలకు చేర్చే వరకు మొబైల్ పార్టీ సిబ్బంది రక్షణ కల్పించవలసి ఉంటుందని అన్నారు.
ప్రతి పోలింగ్ లొకేషన్‌కు ఒక ఎస్సై ఇంఛార్జిగా విధుల్లో ఉంటారని, వీరే కాకుండా సర్కిల్ పరిధిలో స్ట్రైకింగ్ ఫోర్స్‌లు, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్‌లు నియమించడం జరిగిందని ఎన్నికలను ఇన్సిడెంట్ ఫ్రీ గా నిర్వహించేందుకు కృషి చేయడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు.
ఈ కార్యక్రమంలో గద్వాల్ డి. ఎస్పీ యాదగిరి, సాయుధ దళ డి. ఎస్పీ సత్యనారాయణ, ఎస్బి ఇన్స్పెక్టర్ రాజేందర్ రెడ్డి, పి సి ఆర్ ఇన్స్పెక్టర్ జనార్దన్, ఆర్. ఐ పెద్దయ్య, ఎస్సై లు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.