ప్రమాదవశాత్తు మరణించిన కానిస్టేబుల్ కుటుంబానికి 8 లక్షల భద్రత ఎక్స్ గ్రేషియ చెక్కు అందజేసిన జిల్లా ఎస్పీ అమిత్ బర్థార్.
శ్రీకాకుళం, ఏప్రిల్ 12: సోమవారం నాడు జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రమాదవశాత్తువు మరణించిన కానిస్టేబుల్ కుటుంబానికి 8 లక్షల భద్రత ఎక్స్ గ్రేషియ చెక్కును అందజేసిన జిల్లా ఎస్పీ శ్రీ అమిత్ బర్థార్,..
దోనుబాయి పోలీసు స్టేషన్ లో పని చేస్తు, ప్రమాదవశాత్తువు మరణించిన కానిస్టేబుల్ కె. రమేష్ గారి సతీమణి లక్ష్మి గారికి ప్రభుత్వం నుంచి మంజూరు కాబడిన భద్రత ఎక్స్ గ్రేషియ నగదు, రూ.8,00,000.(ఎనిమిది లక్షల) చెక్కు ను ఎస్పీ గారు అందజేసినారు.
ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ జిల్లా పోలీస్ శాఖ బాధిత కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటుందని, ఏ సమస్య వచ్చినా నేరుగా సంప్రదించవచ్చు నుని భరోసా ఇచ్చారు.