నేరమే జరగనప్పుడు చంద్రబాబు నాయుడు నేరస్తుడు ఎలా అవుతారు? మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి…
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడికి సీఐడీ నోటీసులు అందించిన విషయం తెలిసిందే.
అయితే ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాని పేర్కొన్నారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.
ఆయనకు 10 సెక్షన్ల కింద నోటీసులివ్వడం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం దుర్మార్గమని ఈ సందర్భంగా ఆయన ధ్వజమెత్తారు.
అమరావతికి 2015లో 30 వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించారు, ఇప్పటి వరకు ఏ ఒక్క దళితుడు, రైతు కూడా తమకు అన్యాయం జరిగిందని, ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఫిర్యాదు చేయలేదు.
అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగే జరగనేలేదని గతంలోనే హైకోర్టు స్పష్టంగా తీర్పు ఇచ్చింది. హైకోర్టు ఒక్కసారి తీర్పు ఇస్తే అది రూల్ ఆఫ్ లా.
అసలు ఇండియన్ పీనల్ కోడ్లో ఇన్సైడర్ ట్రేడింగ్ అనే పదమే లేదు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికారంలోకి రాగానే 4 వేల ఎకరాల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని గగ్గోలు పెట్టారు, చివరకు 4 ఎకరాల్లో కూడా జరిగిందని నిరూపించలేకపోయారు.
పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ధనబలం, అంగబలం, వలంటీర్లు, పోలీసుల సహకారంతో అందరినీ భయకంపితుల్ని చేసి గెలవగానే భ్రమల్లో తేలుతున్నారు.
ఆళ్ల రామక్రిష్ణారెడ్డి ఫిర్యాదు చేశారని చంద్రబాబు నాయుడుపై అట్రాసిటీ కేసులు పెడతారా, ఆయన రాజధానికి భూములేమైనా ఇచ్చారా.
ఇప్పటికే ఆ ఆళ్ల రామక్రిష్ణారెడ్డి అన్ని కోర్టులకు తిరిగినా ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదనే తీర్పులు వచ్చాయి.
బాధితులు ఎవరైనా నేరుగా ఫిర్యాదు చేసివుంటే విచారణ జరిపి చర్యలు తీసుకోండి.
నేరమే జరగనప్పుడు చంద్రబాబు నాయుడు నేరస్తుడు ఎలా అవుతారు.
గత ఆర్నెల్లుగా ఇళ్ల స్థలాల పంపిణీ కోసం వేలాది ఎకరాల భూములు సేకరించారు, ప్రభుత్వ తీరుతో తమకు అన్యాయం జరుగుతోందని వంద మంది దళితులు ఆత్మహత్యాయత్నం చేశారు..
ఈ ఘటనలకు బాధ్యులైన వైసీపీ ప్రభుత్వంపై ఎన్ని కేసులు పెట్టాలి..
సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు మండలం వెంకన్నపాలెంలో ఒక దళిత యువకుడు, చెర్లోపల్లిలో ఇద్దరు దళిత మహిళలు ఆత్మహత్యాయత్నం చేశారు..
అమరావతి ప్రాంతంలోనూ వైసీపీ ప్రభుత్వం దళితులకు తీవ్రనష్టం చేస్తోంది.
చంద్రబాబు నాయుడు హయాంలో అమరావతి ప్రాంతంలో భారీ భవంతులు నిర్మించి, రోడ్లు ఏర్పాటు చేశారు..
దళితులు, రైతుల భూముల విలువ 10 రెట్లు, 20 రెట్లు పెరిగేలా చంద్రబాబు నాయుడు చేస్తే ఈ రోజు వైసీపీ ప్రభుత్వం వాటిని శిథిలాలుగా మార్చి దళితులకు నష్టం చేకూరుస్తోంది..
అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశాం…చంద్రబాబు నాయుడుపై కేసులు పెట్టామని సంబరబడిపోకండి…
తెలుగుదేశం పార్టీని, నాయకులను మీరేం చేయలేరు..ప్రజలు తిరగబడే రోజు త్వరలోనే ఉంది..
తాను జైలులో ఉన్నాను కాబట్టి, ఏదో ఒక కేసులో చంద్రబాబు నాయుడిని కూడా ఇరికించాలనే జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు ఎప్పటికీ నెరవేరవు..అది దేవుడి వల్ల కూడా కాదు..
మీరు ఎన్నీ వికృత చేష్టలకు పాల్పడినా, దొంగ కేసులు పెట్టినా, అన్యాయాలు, అరాచకాలు చేసినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వెనకడుగు వేసే ప్రసక్తే లేదు..
151 సీట్లతో అధికారంలోకి వచ్చిన మీరు రెండేళ్లలో సాధించిన ప్రగతి ఏమైనా ఉందా అంటే…విపరీతంగా అప్పులు చేయడం..మీరా చంద్రబాబు నాయుడు మీద కేసులు పెట్టేది.. అంటూ ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.