ఆనాడు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో చక్రం తిప్పారు, ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉంటూ వ్యవసాయానికే పరిమితమైపోయారు.
ఈయన్ని గుర్తు పట్టారా ఏపీ కాంగ్రెస్ పార్టీ పిసిసి మాజీ చీఫ్ రఘువీరా రెడ్డి గారు. గతంలో రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిల ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన ఈయన, ఈ రోజున సాదాసీదాగా జీవనం సాగిస్తున్నారు. ఇతర నాయకుల్లాగా హోదాలు ఖరీదైన వాహనాలు జల్సాలు పదవులు, మళ్లీ కొత్త పార్టీలు వైపు చూడకుండా సాదాసీదాగా ఆదర్శంగా జీవిస్తున్నారు. ఇతర నాయకులకు భిన్నంగా జీవిస్తున్నారు. ఇలాంటి నాయకులు అరుదుగా కనిపిస్తుంటారని చూసిన వారంతా మెచ్చుకుంటున్నారు.
ఇటీవల జరిగిన పంచాయితీ ఎన్నికల్లో అయన సాదాసీదాగా ఒక మోపెడ్ పైన వచ్చి ఒటు హక్కును వినియోగించుకున్న వైనం చూపరులను ఎంతగానో ఆకర్షించింది. బిబిసి సైతం ఈయన జీవనశైలిని ఆదర్శంగా కొనియాడుతూ పేర్కొనడం ఇటీవల వైరల్ అయిన అంశం.
