విద్యార్థుల పై నారాయణ యాజమాన్యం అరాచకాన్ని ఖండించండి …
నెల్లూరులో నారాయణ అరవింద నగర్ క్యాంపస్ నందు ఫీజులు కట్టలేదని విద్యార్థులు రోజంతా కిందే నిలబెట్టిన నారాయణ యాజమాన్యం.
దీన్ని ఖండిస్తూ నారాయణ యాజమాన్యం పై క్రిమినల్ కేసులు పెట్టాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కాలేజీ ముందు ధర్నా నిర్వహించారు.
కరోనా కష్టకాలంలో నారాయణ విద్యా సంస్థలు విద్యార్థుల దగ్గర ముక్కు పిండి ఫీజులు వసూలు చేస్తున్నయాని వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
ఇప్పటికే ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి ఫీజులు చెల్లించలేదని నిర్దాక్షిణ్యంగా నడిరోడ్డు మీద విద్యార్థులు నిలబెట్టి ఫీజులు వసూలు చేయడం జరుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నటువంటి నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు నారాయణ విద్యా సంస్థలు వసూలు చేస్తున్నాయని అన్నారు.
ఎన్నిసార్లు ఆర్ఐఓ కార్యాలయం చుట్టూ తిరిగినా ఆర్ ఐ ఒ స్పందించలేదని ఆర్ ఓ జిల్లా ఉన్నతాధికారులు వెంటనే వీటి మీద చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పంచేటి శ్రీనివాసులు కోరారు.