కరోనాతో బిహార్ సీఎస్ కన్నుమూత
పట్నా: కరోనా బారిన పడి సీనియర్ ఐఏఎస్ అధికారి, బిహార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) అరుణ్‌కుమార్ సింగ్ కన్నుమూశారు.
ఇటీవల కరోనా సోకడంతో ఓ ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ శుక్రవారం ప్రాణాలు విడిచారు. 1985 బ్యాచ్‌కు చెందిన ఆయన బిహార్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి.
జేడీయూ అధినేత నీతీశ్ కుమార్ నేతృత్వంలో బిహార్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఆయన సీఎస్‌గా నియమితులయ్యిన ఆయన గతంలో పలు హోదాల్లో పనిచేశారు.
