డొక్కా సీతమ్మ భవన్ వద్ద రెండో డోస్ వ్యాక్సినేషన్..కమిషనర్ త్రిపర్ణ రామ్ కుమార్..
మండపేట: రావులపేట లోని డొక్కా సీతమ్మ భవన్ వద్ద మంగళవారం కోవ్యాక్సిన్ రెండో డోస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు.
పట్టణంలో ఆయా సచివాలయాల పరిధిలో రెండో డోస్ కాల పరిమితి పూర్తి అయిన వారికి సోమవారమే కూపన్లు అందజేశారు.
కాగా వ్యాక్సిన్ కేంద్రం వద్ద టెంట్ ఏర్పాటు చేసి ప్రజలు కూర్చొనేలా ఏర్పాట్లు చేశారు. మునిసిపల్ కమిషనర్ త్రిపర్ణ రామ్ కుమార్ మాట్లాడుతూ కూపన్లు ఉన్న వారు మాత్రమే కేంద్రంకు రావాలని కోరారు.
శుక్రవారం మరికొందరికి రెండో డోస్ వేస్తున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన కూపన్లు ఆయా సచివాలయం పరిధిలో వలంటీరులు గురువారం ఇంటికి వచ్చి పంపిణీ చేస్తారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ కళ్యాణి, మునిసిపల్, ఆరోగ్య, సచివాలయం సిబ్బంది, అడ్మిన్ లు, వాలంటీరులు పాల్గొన్నారు.