సర్పంచ్ లకు వెంటనే చెక్ పవర్ ఇవ్వాలి – రాజేంద్ర ప్రసాద్
మూడు నెలల క్రితం నూతనంగా ఎన్నికైన 12 వేలమంది సర్పంచ్ లకు ఇంత వరకు చెక్ పవర్ ఇవ్వకపోవడాన్ని ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ ఛాంబర్ తీవ్రంగా ఖండిస్తోందని ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ అన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ ను ఎదుర్కోవడానికి 12 వేల గ్రామాల్లో చేపట్టవల్సిన పారిశుద్య పనులకు నిధులు రాక సర్పంచ్ లు ఇబ్బందులు పడుతున్నారు.
CFMS ఖాతా క్రింద ఉన్న గ్రామ పంచాయతీ నిధులు మరియు 14, 15 వ ఆర్థిక సంఘం నిధులను సుమారు 3 వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించి తన స్వంత అవసరాలకు వాడేసుకుందని రాజేంద్ర ప్రసాద్ ఆరోపించారు.
అందుకే సర్పంచ్ లకు చెక్ పవర్ ఇవ్వడం లేదా? అని ఆయన ప్రశ్నించారు.
దీని వల్ల కరోనా నివారణ చర్యలు చేపట్టలేక సర్పంచ్ లు ఉత్సవ విగ్రహాల్లా మిగిలిపోయారని, గ్రామ పంచాయితీలు నిర్వీర్యం అవ్వడంతో గ్రామీణ ప్రజలు కరోనా బారినపడి చనిపోతున్నారని రాజేంద్ర ప్రసాద్ అన్నారు..
తక్షణమే సర్పంచ్ లకు చెక్ పవర్ ఇచ్చి గ్రామీణ ప్రజల్ని ఆదుకోవాలని ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి గార్ని , పంచాయతీ రాజ్ శాఖ మంత్రి శ్రీ పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి గార్ని ఆంధ్రప్రదేశ్ పంచాయితీ రాజ్ ఛాంబర్ తరఫున ఎంఎల్సి రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు.