అర్ధరాత్రి ఇంట్లో చొరబడి భారీ చోరీ
ప్రకాశం జిల్లా.. నాగులుప్పలపాడు మండలం.. బి. నిడమానూరు గ్రామంలోని ఓ ఇంట్లో గురువారం రాత్రి భారీ చోరీ జరిగింది.
వివరాల్లోకెళితే స్థానిక గ్రామంలోని డాక చిన్న కోటిరెడ్డి అనే వ్యక్తి నివాస గృహంలో గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి బీరువాను పగలకొట్టి, సుమారు రూ.1లక్ష నగదుతోపాటు, దాదాపు 25 సవర్లు బంగారాన్ని దోచుకెళ్లినట్లు చిన్న కోటిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు సిఐ సుబ్బారావు మీడియాకు సమాచారం అందించారు.
నాగులుప్పలపాడు ఎస్సై ఆమవరపు శశి కుమార్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేయగా, ఒంగోలు గ్రామీణ సీఐ పి.సుబ్బారావు సంఘటనా స్థలానికి చేరుకుని, క్లూస్ టీంతో తనిఖీలు నిర్వహించారు.
సంఘటనా స్థలంలో వేలిముద్రలు సేకరించి, సీఐ సుబ్బారావు ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో ఎస్సై శశికుమార్, స్టేషన్ సిబ్బంది, క్లూస్ టీం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.