ఓటుకు నోటు కేసుపై విచారణ జరిపే పరిధి ఏసీబీ ప్రత్యేక కోర్టుకు లేదని పేర్కొంటూ నిందితుడైన మల్కాజిగీరి ఎంపీ రేవంత్ రెడ్డి హైకోర్టులో రిట్ దాఖలు చేశారు.
ఈ రిట్‌పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ గురువారం విచారణ చేపట్టారు.
ఇది క్రిమినల్ కేసు కాదని, ఎన్నికల కేసని రేవంత్ తరఫు న్యాయవాది మహమూద్ అలీ చెప్పారు.
అయితే ప్రజాప్రతినిధులను ప్రలోభాలకు గురిచేయడం అవినీతి నిరోధక చట్టం కిందకే వస్తుందని ఏసీబీ న్యాయవాది వి. రవికిరణ్ రావు అన్నారు.
రేవంత్ లేవనెత్తిన అంశాలపై వివరణ ఇస్తూ కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీని హైకోర్టు ఆదేశించింది.
తదుపరి విచారణను ఈనెల 12కి వాయిదా వేస్తన్నట్లు ధర్మాశనం పేర్కొంది.