న నామినేషన్ ను చట్ట విరుద్ధంగా తిరస్కరించార
తన నామినేషన్ ను చట్ట విరుద్ధంగా తిరస్కరించారని దాని తగిన ఆధారాలతో హన్మకొండ లోని ఓ ప్రవేటు హోటల్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన గంటరవికుమార్
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అవినీతి పరులను బయటికి లాగుతా అన్నారు. ఆయన వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే
- మున్సిపల్ కార్పోరేషన్ కు రూపాయి బాకి లేను.
- నిబంధనలకు విరుద్ధంగా నా నామినేషన్ తిరస్కరించిన అధికారులపై కోర్టు లో ఆపిల్ చేసాము.
- ఎమ్మెల్యే కబ్జాలు, అవినీతి బాగోతలు బయట పెడతాను.
- 2019 లొనే గంటరవికుమార్ అనే నేను జిఆర్ కె కంపెనీ నుండి రిజైన్ చేసి బయటికి వచ్చాను.
- నా రాజ్యాంగ హక్కును అధికార బలంతో తొక్కేసారు.
- నా నామినేషన్ తిరస్కరణ పై చర్చ కు ఎక్కడికైనా రావడానికి సిద్ధం.
- అధికారులు, ఎమ్మెల్యే వస్తారా చర్చకు ?
- పచ్ఛిమలో జరిగిన అభివృద్ధి 5 శాతం కూడా తూర్పు లో జరగలేదు.
- మరో 2 సంవత్సరాలలో ఎమ్మెల్యే కు తూర్పు ప్రజలు బుద్ది చెప్పబోతున్నారు.
- శివనగర్ లో టి ఆర్ ఎస్ పార్టీలో ఉద్యమ కారులు లేరా?
- గిర్మాజీపేట్ వ్యక్తి నిలబెట్టడానికి కారణాలేంటి.
- జవాబుదారి తనంలేని ఎమ్మెల్యే తూర్పు ఎమ్మెల్యే.
- 24 డివిజన్ లో 20 డివిజన్ ల వరకు భూకబ్జాదారులకు ,రౌడీ షీటర్లకు టికెట్లు ఇచ్చారు.
- ఒక్కో టికెట్ కి 30 లక్షల నుండి,1 కోటి రూపాయల వరకు ఇచ్చిన వారికే టికెట్ ఇస్తున్నారని సొంత పార్టీ వారే అనడం విడ్డురం.
- ఏది ఏమైనా గంట రవికుమార్ ప్రజల మధ్యలో ప్రజల సమస్యల పై నిరంతరం పోరాడుతేనే ఉంటాడు.