రాజమహేంద్రవరంలోని పుష్కరఘాట్ ను పర్యాటక ప్రదేశంగా అభివృద్ది
రాజమహేంద్రవరం నగరంలో ఉన్న పుష్కరఘాట్ ను పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దేందుకు నగరపాలక సంస్థ అధికారులు, నాయకులు కృషి చేస్తున్న విషయం అందరికి తెలిసింది.
అయితే పర్యాటక ప్రదేశం మాట ఎలా ఉన్నప్పటికి ఘాట్‌లో నీరు మాత్రం మురికి నీటితో దర్శనం ఇవ్వడంతోపాటు దుర్ఘందం వెదజల్లుతుందని పలువురు ఆరోపిస్తున్నారు.
పుష్కరఘాట్‌కు ఆనుకుని ఉన్న హోటల్స్ నుండి మురికి ‘నీరు యదేశ్చగా గోదావరి నదిలోకి వదలడంతో గోదావరి నీరు కలుషితమై నదిలో పుణ్యస్నానాలు ఆచరించే భక్తులకు శాపంగా మారిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదే విషయమై ఎంహెచ్ఓ వినూత్న ను ప్రశ్నించగా సంవత్సరం క్రితం ఆ మాటలకు నగర మున్సిపల్ కార్పొరేషన్ నుండి నోటీసులు పంపించడం జరిగిందని ఆమె తెలిపారు.
ఈ విషయమై ఇప్పటి వరకు నగర పాలక సంస్థ హెటల్ పై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం చూస్తుంటే భారీ స్థాయిలో ముడుపులు అందాయని పలువురు ఆరోపిస్తున్నారు.
పుష్కరఘాట్‌కు ఆనుకుని ఉన్న ఆ హోటల్స్ నుండి గత కొన్ని సంవత్సరాల నుండి ఇదే తంతు జరుగుతున్నప్పటికి గోదావరి వాటర్ బోర్డు, పుష్కరఘాట్‌కు సంబందించిన అధికారులు, నగరపాలక సంస్థ అధికారులు వారి దృష్టిలోకి ఈ సమస్యను తీసుకురాకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.