త్వరలో రైల్వే ఆసుపత్రులకు 86 ఆక్సిజన్ ప్లాంట్లు
ప్రస్తుతం 4 ఆక్సిజన్ ప్లాంట్లు పనిచేస్తుండగా, 52 కొత్త ప్లాంట్లకు అనుమతులు లభించడమే గాక 30 ప్లాంట్ల స్థాపనా పనులు వివిధ దశలలో ఉన్నాయి.
ఈ చర్యతో భారతదేశం అంతటా 86 రైల్వే ఆసుపత్రులలో భారీగా సామర్థ్యాభివృద్ధి జరుగనుంది.
ఇదే సమయంలో, కోవిడ్ చికిత్స కోసం ఏర్పాటు చేసిన పడకల సంఖ్యను 2539 నుండి 6972 కు పెంచారు.
గతంలో 62 మాత్రమే ఇన్వాసివ్ వెంటిలేటర్లు ఉండగా ఇప్పుడు వాటి సంఖ్య 296కు పెంచబడింది.
ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను మంజూరు చేయడానికి 2 కోట్ల రూపాయల వరకు నిధులు కేటాయించేందుకు జనరల్ మేనేజర్లకు మరింత అధికారాలు అప్పగించారు.
కోవిడ్ 19 పై జరుగుతున్న పోరాటంలో భారతీయ రైల్వే తనకు అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తుంది.
ఒక వైపు, రైల్వేలు ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ల ద్వారా అనేక ప్రాంతాలకు ఆక్సిజన్ తరలిస్తూనే మరోవైపు ప్రయాణీకుల మరియు సరుకు రవాణా సేవలు కొనసాగిస్తోంది.
అంతేగాక, రైల్వే తన అంతర్గత వైద్య సదుపాయాలను సైతం మెరుగుపరచుకుంటుంది.
భారతదేశంలోని 86 రైల్వే ఆసుపత్రులలో భారీగా సామర్థ్యాన్ని పెంచడానికి ప్రణాళిక రూపొందించారు.
ప్రస్తుతం 4 ఆక్సిజన్ ప్లాంట్లు పనిచేస్తుండగా, 52 కొత్త ప్లాంట్లకు అనుమతులు లభించడమే గాక 30 ప్లాంట్ల స్థాపనా పనులు వివిధ దశలలో ఉన్నాయి.
ఈ చర్యల ద్వారా త్వరలో అన్ని రైల్వే కోవిడ్ ఆసుపత్రులలో ఆక్సిజన్ ప్లాంట్లు ఉండనున్నాయి.
ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లను మంజూరు చేయడానికి 2 కోట్ల రూపాయల వరకు జనరల్ మేనేజర్లకు అధికారాలను అప్పగించారు.
కోవిడ్ చికిత్స కోసం పడకల సంఖ్యను 2539 నుండి 6972 కు పెంచడంతోపాటు, కోవిడ్ ఆసుపత్రులలోని ఐసియు పడకలను 273 నుండి 573 కు పెంచారు.
ఇన్వాసివ్ వెంటిలేటర్ల సంఖ్య 62 నుండి 296 కు పెంచబడ్డాయి.
రైల్వే ఆసుపత్రులలో BIPAP యంత్రాలు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, ఆక్సిజన్ సిలిండర్లు వంటి అత్యవసర వైద్య పరికరాలను సమకూర్చేందుకు నిరంతరం ప్రయత్నాలు జరుగుతున్నాయి.
కోవిడ్ బాధిత ఉద్యోగులను అవసరానికి అనుగుణంగా రెఫరల్ ప్రాతిపదికన ఎంపానెల్డ్ ఆసుపత్రులలో చేర్పించవచ్చని రైల్వే శాఖ సూచనలు జారీ చేసింది.
రైల్వే హాస్పిటల్లో ఈవిధంగా భారీగా సామర్థ్యాన్ని పెంచడం వైద్య అత్యవసర పరిస్థితులను ఎదుర్కునేందుకు మెరుగైన మౌలిక సదుపాయాలను కల్పిస్తుంది.