కరోనా పాజిటివ్ రావడంతో స్వీయనిర్బంధంలో పూజా హెగ్డే
దేశవ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ కరోనా బారిన సినీ, రాజకీయ ప్రముఖులు కూడా పడుతున్నారు.
ఇప్పటికే పలువురు కరోనా కారణంగా మృతి చెందారు. తాజాగా స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే కూడా కరోనా బారిన పడ్డారు.
నాకు కరోనా పాజిటివ్ వచ్చిందనే విషయాన్ని అందరికీ తెలపాలని అనుకున్నాను, అంటూ తనకు పాజిటివ్ నిర్ధారణ అయిందని ఆమె స్వయంగా ప్రకటించారు.
నియమ నిబంధనలు పాటిస్తూ స్వీయ నిర్బంధంలోకి వెళ్లానట్లు ఆమె తెలిపారు.
అలాగే ఈ మధ్య కాలంలో తనను కలిసిన ప్రతి ఒక్కరు కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరారు.
అందరూ ఇంట్లోనే ఉండండి కరోనా నుంచి కాపాడుకోండి అంటూ పూజ హెగ్డే ట్వీట్ చేసింది.